Viral Video: ఇదెక్క‌డి మాస్ రా మామా.? గ‌న్‌తో గురి పెట్టిన యువ‌తి, ఎందుకో తెలుసా.?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్డోయ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం (జూన్ 15) ఓ పెట్రోల్ బంక్ వద్ద షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

Update: 2025-06-20 07:45 GMT

Viral Video: ఇదెక్క‌డి మాస్ రా మామా.? గ‌న్‌తో గురి పెట్టిన యువ‌తి, ఎందుకో తెలుసా.?

Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్డోయ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం (జూన్ 15) ఓ పెట్రోల్ బంక్ వద్ద షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి కారులో వచ్చిన వ్యక్తి ఆయిల్‌ ఫిల్ చేయించేందుకు సీఏన్జీ స్టేషన్‌కి వచ్చాడు. కానీ భద్రతా కారణాల వల్ల అక్కడి సిబ్బంది కారులో ఉన్నవారిని కిందికి దిగమని కోరారు. దీనిపై అతడు నిరాకరించి వాదనకు దిగాడు.

ఈ నేపథ్యంలో స్టేషన్ వర్కర్ రజనీష్ కుమార్‌తో ఎహ్సాన్ ఖాన్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలోనే కారులో ఉన్న ఖాన్ కూతురు అరిబా తీవ్రంగా స్పందించింది. ఒక్కసారిగా కారు దిగిన అరిబా, తన హ్యాండ్‌బ్యాగ్‌ నుంచి రివాల్వర్‌ బయటకు తీసి రజనీష్‌పై గురిపెట్టింది. "ఇన్ని బుల్లెట్లు తగిలిస్తా... నీ కుటుంబం కూడా గుర్తుపట్టలేరు!" అంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది.

ఘటనను గమనించిన ఇతర సిబ్బంది వెంటనే మద్యలోకి వచ్చి పరిస్థితిని నియంత్రించారు. అరిబా తల్లి ఆమెను శాంతపరిచి తిరిగి కారులోకి తీసుకెళ్లింది. అనంతరం వారు స్టేషన్‌ను వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై రజనీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని, ఎహ్సాన్ ఖాన్ పేరుతో ఉన్న రిజిస్టర్‌డ్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వైర‌ల్ అవుతోన్న వీడియో

స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. యువతి అత్యంత దూకుడుగా గన్‌తో బెదిరించిన తీరు నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఈ వీడియో చూసిన వారు ఇలాంటి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.



Tags:    

Similar News