Viral Video: అనుకున్నదొక్కటి.. అయినదీ మరొక్కటీ.. రీల్స్ చేస్తుండగా యువతికి బిగ్ ట్విస్ట్..!
Viral Video: ఇటీవల యువతలో రీల్స్ మోజు రోజురోజుకూ పెరిగిపోతోంది.
Viral Video: అనుకున్నదొక్కటి.. అయినదీ మరొక్కటీ.. రీల్స్ చేస్తుండగా యువతికి బిగ్ ట్విస్ట్..!
Viral Video: ఇటీవల యువతలో రీల్స్ మోజు రోజురోజుకూ పెరిగిపోతోంది. వైరల్ కావాలన్న ఉద్దేశంతో ప్రాణాలకు సైతం తెగించి రిస్క్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఎవరూ ఊహించని స్టంట్లు చేస్తూ, వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది ఎత్తైన జలపాతాలు, నదులు, సముద్రాల ఒడ్డున… మరికొంత మంది క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి రీల్స్ చేస్తూ సంచలనంగా మారుతున్నారు.
అయితే, ఈ రీల్స్ మోజులో పడి కొందరు తమ ప్రాణాలకే , విలువైన వస్తువులకూ ప్రమాదం తెచ్చిపెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో ఓ యువతి ట్రెండింగ్‌లో నిలిచింది. ఓ యువతి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం మీద కట్టెలతో చేసిన వంతెనపై పడుకుని రీల్ కోసం స్టంట్లు చేసింది. దూరంలో ఉన్న స్నేహితులు ఆమె స్టంట్లను వీడియో తీశారు.
అంతా సవ్యంగా సాగుతుండగా, యువతి తన జేబులో ఉన్న ఫోన్‌ను తీసి పక్కన పెట్టింది. అంతలోనే అపహాస్యంగా అది జారి, నీటిలోకే పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురై, నోరు మాటలేక అక్కడే నిలిచిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు "ఒక రీల్ కోసం ఇంత రిస్క్ అవసరమా?", "వైరల్ కావడం కోసం విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఏంటీ?" అంటూ కామెంట్లు చేస్తున్నారు. రీల్స్ మోజు ఎంత ప్రమాదకరంగా మారిందన్న దానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది.