Viral Video: ఎరక్కపోయి వెళ్లింది, ఇరుక్కుపోయింది.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
Viral Video: సామాన్యంగా ట్రాఫిక్ టైమ్‌లో, రోడ్ల మరమ్మతులు జరుగుతున్నప్పుడు చక్కగా గమనిస్తూ, ఓపికగా నడవాలి. త్వరగా వెళ్లాలని తొందరపడితే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
Viral Video: ఎరక్కపోయి వెళ్లింది, ఇరుక్కుపోయింది.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
Viral Video: సామాన్యంగా ట్రాఫిక్ టైమ్‌లో, రోడ్ల మరమ్మతులు జరుగుతున్నప్పుడు చక్కగా గమనిస్తూ, ఓపికగా నడవాలి. త్వరగా వెళ్లాలని తొందరపడితే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితిని ఒక యువతి ఎదుర్కొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ రహదారిపై తారు వేసిన వెంటనే ఆ యువతి అటు వైపు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. తారు ఇంకా ఆరకముందే, ఆమె నడవడానికి ఎంచుకున్న దారి ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆమె వేసుకున్న చెప్పులు తారులో ఇరుక్కుపోయాయి. ఎంత లాగినప్పటికీ బయటకు రాలేదు. దీంతో చివరికి చెప్పులను అక్కడే వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
దీనంతటినీ అక్కడే ఉన్న వాళ్లు వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. రోడ్డుపై పరిస్థితిని అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తే ఏమవుతుందో చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను లక్ష మందికిపైగా చూశారు. ఇక వెనకా ముందు చూసుకోకుండా వెళ్తే, పరిస్థితులు ఇలాగే ఉంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.