Viral News: అదృష్టం అంటే ఇది భయ్యా.. రూ. లక్ష ఏకంగా రూ. 80 కోట్లు అయ్యాయి..!
JSW Shares: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేమన్నదానికి ఈ సంఘటన బలం చేకూర్చుతుంది. 1990లో ఓ వ్యక్తి రూ.1 లక్షతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు.
Viral News: అదృష్టం అంటే ఇది భయ్యా.. రూ. లక్ష ఏకంగా రూ. 80 కోట్లు అయ్యాయి..!
JSW Shares: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేమన్నదానికి ఈ సంఘటన బలం చేకూర్చుతుంది. 1990లో ఓ వ్యక్తి రూ.1 లక్షతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు. కాలక్రమంలో ఆ పత్రాలను ఎక్కడో మూలన పెట్టేసి మరచిపోయాడు.
అయితే ఇటీవల ఆయన కుమారుడు ఇంటిలో శుభ్రం చేస్తుండగా ఆ పాత షేర్ సర్టిఫికెట్లను గుర్తించాడు. ఆసక్తితో ఆరా తీస్తే… షేర్‌ల విలువ ఊహించని స్థాయికి చేరినట్లు తెలుస్తుంది. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు కాదు… ఏకంగా రూ.80 కోట్లు అయ్యిందట!
ఈ సమాచారం సౌరవ్ దత్తా అనే వ్యక్తి ద్వారా ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో షేర్ చేయడంతో… ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది. దీర్ఘకాల పెట్టుబడులు ఎలా విలువ పెంచుతాయో చెప్పడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక దీన్ని బట్టి… ‘స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్, లాంగ్‌టెర్మ్ పేషెన్స్’ ఎంత గొప్ప ఫలితాలిస్తాయో మరోసారి రుజువైంది.