Viral Video: రోడ్డుపై పద్ధతిగా క్యూ లైన్‌లో వెళ్తున్న చేపలు.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: మనం సాధారణంగా లైన్‌లో వెళ్లే చీమలు, పాఠశాల విద్యార్థులు లేదా ఆవులు, గేదెలను చూసి ఉంటాం. కానీ తాజాగా గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో చేపలు రోడ్డుపై పాకుతూ ఒకదాని వెనక ఒకటి వెళ్లిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వింతైన దృశ్యం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒకటైన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామంలో నమోదైంది. రోడ్డుపైపెద్ద సంఖ్యలో చేపలు వరుసగా పాకుతూ ఒక చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్తున్నాయి. ప్రయాణికులు ఆశ్చర్యంగా ఆగిపోయి, వీడియోలు తీశారు.
స్థానికుల చెబుతునా వివరాల ప్రకారం, ఇవి సాధారణ చేపలు కావు. వీటిని "గొరస" చేపలు అని పిలుస్తారు. ఇవి నీరు లేకుండా రెండు రోజులు వరకు జీవించగలవు. ఎండాకాలంలో చెరువులు ఎండిపోతున్న తరుణంలో, ఇవి నీరు ఉన్న ప్రదేశాలవైపు ప్రయాణం చేస్తాయి.
ఇప్పటికే జరిగిన వర్షాల వల్ల ఒక చెరువులో తక్కువగా, మరో చెరువులో అధికంగా నీరు ఉండటంతో, ఈ గొరస చేపలు రోడ్డును దాటి ప్రయాణం చేశాయి. ఇదే సమయంలో ప్రయాణికులు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విధమైన సంఘటనలు కోనసీమ ప్రాంతంలో తరచుగా జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. గొరస చేపలు కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో చురుకుగా నేలమీద పాకుతూ గమనించే అవకాశం ఉంటుంది.