Viral Video: నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క
Viral Video: వైరల్ వీడియోలు అంటే సోషల్ మీడియా ప్రధాన వేదిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Viral Video: నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క
Viral Video: వైరల్ వీడియోలు అంటే సోషల్ మీడియా ప్రధాన వేదిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోజు రోజుకు అసాధారణమైన ఘటనలతో సంబంధిత వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వన్యప్రాణుల వీడియోలు ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో కొన్ని భయపెట్టేలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా పులి కనిపిస్తే ఎవరైనా భయంతో వెనక్కి తగ్గిపోతారు. కానీ ఈ వీడియోలో ఓ సాధారణ కుక్క నిద్రలో నుంచే గర్జిస్తూ పులిని ఎదురించడమే కాదు.. దాన్ని భయపెట్టి వెళ్లిపోయేలా చేసింది. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
వీడియో వివరాల్లోకి వెళ్తే... ఓ కుక్క రోడ్డుపై నిద్రిస్తున్న సమయంలో పొదల మధ్య నుంచి ఓ చిరుతపులి (లీపర్డ్) దాడికి ప్రయత్నిస్తుంది. కానీ వెంటనే అప్రమత్తమైన కుక్క బలంగా అరుస్తూ, పులిని ఎదుర్కొంది. ఈ ఆకస్మిక ధైర్యానికి భయపడిన చిరుత అక్కడినుంచి వెనుదిరిగి వెళ్లిపోవడం గమనార్హం.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. “ధైర్యం ఉంటే ఎంతటి శక్తివంతమైన శత్రిని అయినా ఎదుర్కొనవచ్చుననే సందేశాన్ని ఈ వీడియో అందిస్తోంది” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.