Viral Video: హీరోయిన్ నడుంపై చేయి వేసిన అభిమాని.. వైరల్ అవుతోన్న వీడియో..!

Viral Video: అభిమానులకు, సినీతారలకు మధ్య దూరం తగ్గిపోయింది. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు స్టార్స్.

Update: 2025-05-03 05:44 GMT

Viral Video: హీరోయిన్ నడుంపై చేయి వేసిన అభిమాని.. వైరల్ అవుతోన్న వీడియో..!

Viral Video: అభిమానులకు, సినీతారలకు మధ్య దూరం తగ్గిపోయింది. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు స్టార్స్. అయితే దీనిని కొంద‌రు మిస్ యూజ్ చేస్తున్నారు. సెలెబ్రిటీలను చూశారంటే కొందరు తమ పరిమితులను మరచిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో హ‌ద్దు దాటుతున్నారు.

సెల్ఫీలు తీసుకోవాలన్న ఉత్సాహం పేరుతో పలువురు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా ఓ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఓ అభిమాని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈమధ్య మంజు వారియర్ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆమెను చూడాలనే ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం, మంజు వారియర్ తన కారవద్దకు వెళ్లారు. అప్పటికే జనాలు ఆమె చుట్టూ గుమిగూడారు. అభిమానులకు అభివాదం తెలిపేందుకు ఆమె కారులోంచి బయటకు వచ్చారు.

ఈ క్రమంలో కొందరు ఆమెతో షేక్‌హ్యాండ్ చేయాలన్న ఉద్దేశంతో చేతులు చాచగా, ఆమె స్పందించలేదు. అప్పుడు ఒక యువకుడు ముందుకొచ్చి మంజు నడుము వైపు చేతి వేసి లాగే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనను చూసినవారంతా ఆశ్చర్యపోయారు. మంజు వారియర్ మాత్రం ఆ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అక్కడే ఉన్న కొంతమందితో ఫొటోలు దిగి, వాహనంలోకి ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ అభిమాని ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు.


Tags:    

Similar News