Viral Video: డేగ చేప‌ను వేటాడ‌డం ఎప్పుడైనా చూశారా.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Viral Video: వేట అనేది సృష్టి ధ‌ర్మం అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక జీవి మ‌రో జీవిని వేటాడ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కొన్ని సంద‌ర్భాల్లో ఈ వేట అసాధ‌రణంగా ఉంటుంది. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇలాంటి ఓ అసాధార‌ణ వేట‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Update: 2025-06-19 10:30 GMT

డేగలు వేటాడే తీరు చాలా అద్భుతంగా ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చేపను పట్టుకునే క్రమంలో డేగా చూపిన చురుకుదనం, పట్టుదల చూసిన ప్రతి ఒక్క‌రూ విస్తుపోవాల్సిందే. ఓ డేగ ఓ భారీ చేపను గమనించింది. వెంటనే దానిపై దాడి చేసింది. చేప కొంత సమయానికి ఎదురుదాడి చేసి, డేగను నీటిలోకి లాగేందుకు ప్రయత్నించింది.

కానీ డేగ మాత్రం ఆ చేపను విడిచిపెట్టలేదు. ఒక్క కాలు సహాయంతోనే దానిని గట్టిగా పట్టుకుని చివరికి గాలిలోకి ఎగిరింది. ఈ దృశ్యం చూస్తే, డేగల శారీరక శక్తి, వేట నైపుణ్యం ఎంత అసాధ‌ర‌ణ‌మో అర్థ‌మ‌వుతోంది. వేటలో విజయం సాధించిన తర్వాత ఆ డేగ విశ్రాంతిగా ఆ చేపను తింటూ కనిపించింది.

ఈ సన్నివేశం అంతా చూస్తుంటే ప్రకృతిలోని జీవుల బలాన్ని, సమర్థతను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ వేటకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Tags:    

Similar News