Viral News: మనిషేనా వీడు.. సమాధిలో శవాన్ని బయటకు తీసి సెల్ఫీ దిగిన వ్యక్తి..!
సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని భయపెడతాయి.
Viral: మనిషేనా వీడు.. సమాధిలో శవాన్ని బయటకు తీసి సెల్ఫీ దిగిన వ్యక్తి.
Viral: సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని భయపెడతాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ వ్యక్తి సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి, దానితో సెల్ఫీలు దిగాడు.
ఈ సంఘటనతో గ్రామంలో ఉన్నవారంతా ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. ఆగ్రహంతో అతడిని చితక్కొట్టారు. పోలీసులు వచ్చి అతడిని రక్షించేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడికి దిగారు. ఈ ఘటన తూర్పు మేదినీపూర్ జిల్లా కాంటాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి స్థానికుడైన ప్రభాకర్ అనే వ్యక్తి, ఓ స్మశానవాటికలోని సమాధిని తవ్వి ఏడేళ్ల క్రితం పూడ్చిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారి ఉంది. ఆ ఎముకలను ఓ చెట్టుకు వేలాడదీయడంతో పాటు, దాంతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించాడు.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు తీవ్రంగా స్పందించారు. ప్రభాకర్‌ను పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించేందుకు ప్రయత్నించగా, స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.
దాదాపు రెండు గంటల అనంతరం పరిస్థితి కాస్త నియంత్రణలోకి వచ్చింది. పోలీసులు ప్రభాకర్‌ను ఘటనా స్థలం నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ పక్కనే మద్యం బాటిల్ కనిపించిన నేపథ్యంలో, ప్రభాకర్ మద్యం మత్తులోనే ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం ప్రకారం అతడు ఒక హోటల్‌లో పని చేసేవాడు. అయితే అతడి మద్యం అలవాటు వల్లే ఉద్యోగం కోల్పోయాడని తెలుస్తోంది. అయితే మహిళ మృతదేహాన్ని ఎందుకు తవ్వి బయటకు తీసాడన్న విషయంపై ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.