ఈ నగరంలో మరణాలను నిషేధించారు.. 70 ఏళ్లుగా ఒక్కరూ చనిపోలేదు..

Longyearbyen: కానీ ఒక నగరంలో మరణాలను నిషేధించారని తెలిస్తే మీరు షాక్ అవుతారు..

Update: 2021-11-10 13:45 GMT

మరణాలను నిషేధించిన లాంగ్ఇయర్బైన్ నగరం (ఫైల్ ఇమేజ్)

Longyearbyen: జనన, మరణాలపై ఎవ్వరికీ నియంత్రణ ఉండదు.. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కానీ ఒక నగరంలో మరణాలను నిషేధించారని తెలిస్తే మీరు షాక్ అవుతారు.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. నార్వేలోని ఒక చిన్న పట్టణమైన లాంగ్ఇయర్బైన్ నగరంలో మరణాలను నిషేధించారు. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. జీవించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఇక్కడ చనిపోవడానికి అనుమతించరు. గత 70 ఏళ్లలో ఇక్కడ ఎవరూ కూడా చనిపోలేదు. అయితే ఈ నగరంలో ఎందుకు చనిపోకూడదో తెలుసుకుందాం.

నిజానికి ఇక్కడి వాతావరణ దృష్ట్యా చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఎవరైనా చనిపోతే మృతదేహం చాలా ఏళ్లు ఫ్రెష్గా ఉంటుంది. తీవ్రమైన చలి కారణంగా కుళ్ళిపోదు. దీని వల్ల మృతదేహాలను ధ్వంసం చేయడానికి సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం, శాస్త్రవేత్తలు ఒక శరీరంపై పరిశోధన చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1917 సంవత్సరంలో ఇన్ఫ్లుఎంజా కారణంగా మరణించిన వ్యక్తి శరీరంలో ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత పరిపాలన విభాగం ఈ ప్రాంతంలో ప్రజల మరణాలను నిషేధించింది.

ఆ తర్వాత ప్రజల్లో భయం నెలకొంది. ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చనిపోతే లేదా అతనికి అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆ వ్యక్తిని హెలికాప్టర్ సహాయంతో దేశంలోని మరొక ప్రాంతానికి తీసుకెళ్లి అతను చనిపోయిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు.ఈ నగరంలో శాస్త్రవేత్తలు, సాహస పర్యాటకులు పరిశోధనలు చేస్తున్నారు. సామాన్యులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఇష్టపడరు. 2000 వేల జనాభా ఉన్న ఈ నగరంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే విమానంలోనో, హెలికాప్టర్లోనో వేరే ప్రాంతానికి తీసుకెళ్లి చనిపోయిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ.

Tags:    

Similar News