Air Conditioner: కారులో ఏసీ ఆన్‌ చేసినా చల్లబడటం లేదా.. ఈ చిట్కాలు పాటించండి..!

Air Conditioner: దేశంలో ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సంవత్సరం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలని ఇబ్బంది పెడుతున్నాయి.

Update: 2022-05-16 11:00 GMT

Air Conditioner: కారులో ఏసీ ఆన్‌ చేసినా చల్లబడటం లేదా.. ఈ చిట్కాలు పాటించండి..!

Air Conditioner: దేశంలో ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సంవత్సరం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో మీరు బయటకు వెళ్లవలసి వస్తే మీకు కారు మాత్రమే బెస్ట్ ఆప్షన్. దీనికి ఏకైక కారణం కారులో ఉండే AC. వేసవిలో కారులో ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మండే ఎండలో కూడా క్యాబిన్‌ను చల్లగా ఉంచుతుంది. కానీ ఏసీ మంచి కూలింగ్ ఇస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురంచి తెలుసుకుందాం.

AC ఆన్ చేసే ముందు కారు కిటికీలను కొద్దిగా తగ్గించి క్యాబిన్‌లో ఉన్న వేడి గాలిని బయటకు వెళ్లనివ్వండి. కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు క్యాబిన్‌లోకి గాలి వేగంగా వస్తుంది. పార్క్ చేసిన కారులో ఫ్యాన్‌ను నడపడం ద్వారా గాలిని వేగంగా తొలగించవచ్చు. తర్వాత మీరు ఏసీని ఆన్‌ చేస్తే అది మరింత కూలింగ్ ఇవ్వడమే కాకుండా వేగంగా కారు మొత్తం చల్లబరుస్తుంది.

వేసవిలో ఎక్కువ సూర్యకాంతి కారు రంగును దెబ్బతీయడమే కాకుండా క్యాబిన్‌ను దెబ్బతీస్తుంది. కారును ఎండలో బయట పార్క్ చేస్తే అది AC సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు వేసవిలో వేడిగా ఉన్న కారులో ఏసీని నడుపుతుంటే క్యాబిన్ చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వేసవి కాలంలో మీరు ఎండలో కారును పార్కింగ్ చేయకూడదు.

క్యాబిన్ నుంచి వేడి గాలిని బయటకు పంపి చల్లటి గాలిని ఇచ్చే ప్రక్రియలో కారు AC కండెన్సర్ కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే AC కండెన్సర్ సరిగ్గా పని చేయకపోతే క్యాబిన్‌ త్వరగా చల్లబడదు. కాబట్టి ఏసీ కండెన్సర్ శుభ్రంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

కారు నుంచి వేడి గాలి బయటకు వచ్చి చల్లని గాలి లోపలికి వచ్చిన తర్వాత మీరు AC ప్యానెల్‌లో రీసర్క్యులేషన్ బటన్‌ను చూస్తారు. దానిని ఆన్ చేయండి తద్వారా క్యాబిన్ అంతటా చల్లని గాలి వెళుతుంది. ప్రయాణికులందరికి చల్లటి గాలి లభిస్తుంది. 

Tags:    

Similar News