Viral Video: వంటింట్లోకి వచ్చిన పాము కత్తిని మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Viral Video: కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా, కుంత తాలూకాలోని హెగ్డే గ్రామంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఒక ఇంట్లోకి పాము వచ్చింది. వంటగదిలో పామును గుర్తించిన ఇంటి యజమాని గోవింద నాయక్ వెంటనే స్నేక్ రెస్క్యూకు చెందిన వారికి సమాచారాన్ని అందించారు.

అయితే ఆ పాము కదలకుండా ఉండడాన్ని గమనించిన స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యులు పాము కడుపులో కత్తి ఉన్నట్లు గుర్తించారు. ఆ పాము తనకు ఆహారం కోసం వెతికేటప్పుడు పొరపాటున 12 అంగుళాల వంటగది కత్తిని మింగినట్లు అర్థమైంది. విషయం తెలుసుకున్న వెంటనే పావన్ అనే నిపుణుడు (స్నేక్ హ్యాండ్లర్), వెటర్నరీ అసిస్టెంట్ అద్వైత్ భట్ పాము కడుపులో నుంచి కత్తి తీసే ప్రయత్నం చేశారు.
వైద్య పరికరాలతో నెమ్మదిగా పాము నోరు తెరిచి దాదాపు ఒక అడుగు పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉన్న కత్తిని బయటకు తీశారు. ఈ మొత్తం ప్రక్రియలో పాముకు ఎటువంటి హాని జరగకుండా చూశారు. అనంతరం పామును అడవిలో వదిలిపెట్టేశారు.
దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. యాసిర్ ముష్తాక్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "కర్ణాటకలోని హెగ్డే గ్రామంలో పాము పొరపాటున వంటకత్తిని మింగింది. పామును సురక్షితంగా కాపాడిన పావన్, అద్వైత్ భట్‌కు అభినందనలు" అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.