Viral Video: నువ్వు తోపు భయ్యా.. బాటిల్ తో నాగుపాముకు నీళ్లను తాగించిన యువకుడు.. వీడియో వైరల్..!

Cobra Snake Drinking Water Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుండటం ఇప్పుడు సాధారణమైన విషయమే.

Update: 2025-06-09 11:27 GMT

Viral Video: నువ్వు తోపు భయ్యా.. బాటిల్ తో నాగుపాముకు నీళ్లను తాగించిన యువకుడు.. వీడియో వైరల్..!

Cobra Snake Drinking Water Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుండటం ఇప్పుడు సాధారణమైన విషయమే. కోబ్రా పాములు కనిపించే వీడియోలకు అయితే నెటిజన్లలో ప్రత్యేకమైన ఆసక్తి ఉండటం గమనార్హం. ఇటీవల రకరకాల పాముల వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు భయాన్ని కలిగిస్తుంటే, మరికొన్ని వింత అనిపించేస్తున్నాయి. అయినప్పటికీ వాటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో వాతావరణం మారుమోగిపోతోంది. ఎండలు పడిన వెంటనే ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఒక పాము తీవ్ర ఎండ వేడి తాళలేక రోడ్డుపై అలసిపోయి పడిపోయింది.

ఆ పామును గమనించిన ఓ యువకుడు తన వద్ద ఉన్న బాటిల్‌లో నీళ్లు తీసుకొని మొదట పాముపై చల్లాడు. అనంతరం నెమ్మదిగా బాటిల్‌ ద్వారా నీళ్లు పోశాడు. ఆ కోబ్రా పాము గట గటమని నీళ్లు తాగడం చూడగానే అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న మరికొంత మంది మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వీడియో వేగంగా వైరల్ అయింది. పామును కాపాడిన ఆ యువకుడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ, మంచి పని చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags:    

Similar News