China function hall: ఆర్డర్ పెడితే చాలు.. ఇక ఫంక్షన్ హాల్స్ మీ ఇంటికే వస్తాయి

China function hall: భారత దేశంలో పెళ్లి చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. పందిళ్లు వెయ్యాలి. తోరణాలు కట్టాలి. పెళ్లి మండపం వేయడం కోసం ఒక పెద్ద స్థలమే వెతకాలి. అబ్బో ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉంటాయి.

Update: 2025-07-11 12:56 GMT

China function hall: ఆర్డర్ పెడితే చాలు.. ఇక ఫంక్షన్ హాల్స్ మీ ఇంటికే వస్తాయి

China function hall: భారత దేశంలో పెళ్లి చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. పందిళ్లు వెయ్యాలి. తోరణాలు కట్టాలి. పెళ్లి మండపం వేయడం కోసం ఒక పెద్ద స్థలమే వెతకాలి. అబ్బో ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉంటాయి. అందుకే పెళ్లి అంటే మాటలు కాదని చాలామంది అంటారు. అయితే చైనావాళ్లకు ఇవేమీ అవసరం లేదు. ఒక ట్రక్ ఉంటే సరిపోతుంది. పెళ్లికోసం ట్రక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? పదండి మీకే తెలుస్తుంది.

పెళ్లి చేయాలంటే మండపం వేయాలి. ఆ మండపం వేయాలంటే పెద్ద స్థలం కావాలి. అంతేకాదు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కూడా. మన ఇండియాలో అంత కాకపోయినా చైనాలో కూడా పెళ్లిళ్లు గ్రాండ్‌గా జరుగుతుంటాయి. చుట్టాలు కూడా భారీగానే వస్తుంటారు. అయితే ఎవరికి ఈ బుద్ది పుట్టిందో ఏంటో తెలియదు కానీ.. చైనాలో ఇప్పుడు మూవబుల్ ట్రక్ ఫంక్షన్ హాళ్ల ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి చేయాలనుకుంటే ఎక్కడికైనా ఈ ట్రక్‌ని తీసుకెళ్లిపోవచ్చు.

ఎక్కడ ఖాళీ స్థలంలో ఉంటుంది అక్కడకు ట్రక్ వచ్చి ఆగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా రెక్కలు విప్పుకుంటాయి. స్టాండ్‌లు భూమిని స్టిక్ చేసుకుంటాయి. వాల్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి పెద్ద ఫంక్షన్ హాల్‌గా ట్రక్ మారిపోతుంది. ఇక ఈ ఫంక్షన్ హాల్‌లోనే పెళ్లి మండపం, ఈ ఫంక్షన్ హాల్‌లోనే అతిధులకు చెయిర్స్ అన్నీ చకా చకా సిద్దం అయిపోతాయి.

అయితే లారీ ట్రక్కుతో వచ్చింది కదా ఈ మూవబుల్ ఫంక్షన్ హాల్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ లగ్జరీ ఫంక్షన్ హాల్‌కి తీసిపోకుండా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. డెకరేషన్ లుక్‌ కూడా అదిరిపోతుంది. ఇంటీరియల్ డిజైనింగ్, కలర్ కాంబినేషన్ కూడా వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పటికి ఒక ఆర్డర్ పెడితే చాలు. ఫంక్షన్ హాల్ ఇక మీ ఇంటికే వస్తుంది. భలే బావుంది కదూ.


Full View


Tags:    

Similar News