Optical illusion: ఆకులై ఆకునై... ఈ ఫొటోలో దాగున్న పామును కనిపెట్టండి చూద్దాం..!
Optical illusion: వీడియోలు, కామెడీ మీమ్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Optical illusion: ఆకులై ఆకునై... ఈ ఫొటోలో దాగున్న పామును కనిపెట్టండి చూద్దాం.
Optical illusion: వీడియోలు, కామెడీ మీమ్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మెదడుకు పని చెప్పే కంటెంట్‌కి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను సాల్వ్ చేయడంలో భలే కిక్కు ఉంటుంది.
యువత వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతోంది. ప్రతీ రోజు ఇలాంటి ఫొటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న ఫొటోను చూస్తే ఏదో అడవి ప్రాంతంలా ఉంది కదూ. ఎండిపోయిన ఆకులు, గడ్డి కనిపిస్తుంది. అయితే ఆ ఎండిపోయిన ఆకుల్లో ఓ పాము దాగి ఉంది. ఆ పామును కనిపెట్టారా.? ఈ పజిల్‌ను 10 సెకండ్లలో సాల్వ్ చేస్తే మీరు తోపు అని అర్థం.
ఫోటోను ఓ సారి గమనంగా పరిశీలించండి. అక్కడక్కడ కనిపించే ఆకులు, దుమ్ము, పచ్చదనం – అన్నింటినీ దగ్గరగా చూడండి. పాము అక్కడే ఉంది కానీ అది మీ దృష్టిని మోసం చేస్తోంది. కంటికి కనిపించకుండా కలిసిపోయేలా ఉంది. ఎంత ప్రయత్నించినా మీరు పామును గుర్తించలేకపోతే సమాధానం కోసం కింద ఫొటోను చూసేయండి.