Guess the Actress: ఈ ఫొటోలో ఉన్న క్యూట్ గ‌ర్ల్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? మ‌న తెలుగుమ్మాయే

Guess the Actress: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Update: 2025-05-22 08:25 GMT

Guess the Actress: ఈ ఫొటోలో ఉన్న క్యూట్ గ‌ర్ల్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? మ‌న తెలుగుమ్మాయే

Guess the Actress: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీ తారల చిన్న‌నాటి చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పుట్టినరోజు, ప్రత్యేక సందర్బాల్లో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ సినిమా స్టార్లు తమ చైల్డ్‌వుడ్ ఫోటోలను పంచుకుంటున్నారు. ఇండస్ట్రీ ఏది అయినా సరే– టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ఇప్పుడు ప్రతి చోటా ఇదే ట్రెండ్‌.

ఇటీవల ఓ ప్రముఖ హీరోయిన్ చిన్ననాటి ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఫోటో చూసినవాళ్లంతా ఆమె క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా రంగంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ తార, తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళం, మలయాళం, హిందీలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.

ఈ చిన్నారి మ‌రెవ‌రో కాదు అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ. తెలుగమ్మాయైన శోభిత, మొదటగా హిందీ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. తర్వాత గూడచారి సినిమాలో అడవి శేష్ సరసన నటించి తెలుగువారికి చేరువయ్యింది. హిందీలో ఘోస్ట్ స్టోరీస్, మలయాళంలో కురుప్, తెలుగు-తమిళంలో మేజర్, పొన్నియన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాలతో తన ట్యాలెంట్‌ను చాటుకుంది.

ఇక కొన్నేళ్ల పాటు నాగ చైత‌న్య‌తో ప్రేమ‌లో ఉన్న శోభిత పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒక్క‌ట‌య్యారు. ప్ర‌స్తుతం ఈ జంట హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తోంది. కాగా శోభిత అమ్మ కాబోతోంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

Tags:    

Similar News