సమోసాల్లో పురుగులు మందు కలిపి.. ఆపై ప్రేమతో భర్తకు తినిపించి.. భర్తను చంపిన కొత్త పెళ్లి కూతురు..
Woman Kills Husband: మేఘాలయ హనీమూన్ కేసును మరకముందే మరొక కొత్త పెళ్లి కూతురు తన భర్తను హతమార్చింది.
సమోసాల్లో పురుగులు మందు కలిపి.. ఆపై ప్రేమతో భర్తకు తినిపించి.. భర్తను చంపిన కొత్త పెళ్లి కూతురు..
Woman Kills Husband: మేఘాలయ హనీమూన్ కేసును మరకముందే మరొక కొత్త పెళ్లి కూతురు తన భర్తను హతమార్చింది. పెళ్లై 36 రోజులైన తర్వాత సమోసాల్లో పురుగుల మందు కలిపి ఇచ్చింది. దీంతో భర్త తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరణించాడు. ఈ కేసు జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం..
జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో బహోకుదర్ ఊరికి చెందిన బుద్ధనాథ్ సింగ్‌తో ఇటీవల సునీతా దేవి(22)తో పెళ్లి జరగింది. ఎంతో సంతోషంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లాంచనాలు ఇచ్చి... సునీతను భర్తతో కలిపి అత్తవారింటి పంపారు. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ అత్తవారింటికి వెళ్లిన మొదట రోజే తన భర్తతో కాపరం చేయడం ఇష్టం లేదని చెప్పి పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అయితే పెద్దలు, కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి మళ్లీ తన భర్త ఇంటికి పంపించారు. అయితే వెళ్లిన తర్వాత రోజు తన భర్తతో ప్రేమగా ఉన్నట్లు నటించి కోడకూర వండింది. సమోసాలు చేసింది.
ఈ సమోసాల్లో పెరట్లోని మొక్కలు కోసం తెచ్చిన పురుగుల మందుని కలిపింది. ఆ తర్వాత ఎంతో ప్రేమతో కొసరి కొసరి వడ్డించి మరీ తన భర్తకు ఆ సమోసాలు తినిపించింది. సమోసాలు తిన్న తర్వాత బుద్ధనాథ్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. హాస్పిటల్‌కి తరలించినా ఫలితం దక్కలేదు. శవమై ఇంటికి తిరిగివచ్చాడు. మృతుడి కుటుంబం కొత్త కోడలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సునీతను విచారిస్తే అసలు విషయాలు బయటపెడ్డాయి. ప్లాన్ 1 ప్రకారం సమోసాల్లో మందు కలిపి భర్తకు తినిపించి చంపాలి. ఇది సక్సెస్ కాకపోతే తన దగ్గర ప్లాన్ 2, ప్లాన్ 3 కూడా ఉన్నాయి. వీటి కోసం రెండు పురుగులమందు ప్యాకెట్లు తన జాకెట్లో సునీత దాచుకుంది. అయితే ప్లాన్ 1లో తన భర్త చనిపోవడం ఆ ప్యాకెట్లు ఇంటివెనుకకు విసిరేసిందని పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసులు ఇంకా ఈ కేసును మరింత లోతుగా ధర్యాప్తు చేస్తున్నారు.