Viral Video: పెళ్లి వేడుకలో వెరైటీ గిఫ్ట్.. ముసిముసి నవ్వులు నవ్విన నవ వధువు
Viral Video: ప్రస్తుతం వివాహ వేడుకలు కేవలం రెండు మనసుల కలయికే కాకుండా, వినోదానికి వేదికలుగా కూడా మారాయి. తాజాగా ఒక పెళ్లి వేడుకలో వరుడి స్నేహితులు ఇచ్చిన ప్రత్యేక బహుమతి అందరినీ ఆశ్చర్యపరచింది.
Viral Video: పెళ్లి వేడుకలో వెరైటీ గిఫ్ట్.. ముసిముసి నవ్వులు నవ్విన నవ వధువు
Viral Video: ప్రస్తుతం వివాహ వేడుకలు కేవలం రెండు మనసుల కలయికే కాకుండా, వినోదానికి వేదికలుగా కూడా మారాయి. తాజాగా ఒక పెళ్లి వేడుకలో వరుడి స్నేహితులు ఇచ్చిన ప్రత్యేక బహుమతి అందరినీ ఆశ్చర్యపరచింది. అది చూసిన వధువు సిగ్గుతో ముసి ముసి నవ్వులు నవ్వింది. ఇంతకీ ఆ గిఫ్ట్‌లో ఉన్న అంత స్పెషల్ ఏంటనేగా.?
వధూవరులు వేదికపై ఉన్నసమయంలో వరుడి స్నేహితులు గ్రూపుగా స్టేజ్‌కి వచ్చారు. అందరూ ఏదో సాధారణ బహుమతే ఇస్తారని అనుకుంటున్న వేళ, వారు తెచ్చిన బాక్సుల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వధువు చేతిలో చిన్న పిల్లల పాల సీసా పెట్టారు, వరుడి చేతిలో బంగారు రంగు గిలక ఇచ్చారు.
దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయేలోగా ఆ స్నేహితులు మరో పెద్ద పోస్టర్ తీసుకువచ్చి అందరికీ చూపించారు. అందులో రాసిఉన్న సందేశం: “కొంచెం ఆగండి… మేమూ 9 నెలల్లో వస్తున్నాం!” అని రాసి ఉంది. దీంతో ఇది చూసిన నవ వధువు ముసి ముసిగా నవ్వుతూ తల దించుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు స్పందిస్తూ పెళ్లి అంటే ఇలాంటి మజా ఉండాలబ్బా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.