Viral Video: విషాదంగా మారిన ట్రెక్కింగ్.. 490 అడుగులో పడి యువతి మృతి. షాకింగ్ వీడియో
Viral Video: ఇండోనేసియాలోని ప్రసిద్ధి చెందిన మౌంట్ రింజానీ అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ బ్రెజిల్ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది.. జూలియానా మారిన్స్ (26) అనే పబ్లిసిస్ట్, స్నేహితులతో కలిసి లొంబోక్ ద్వీపంలోని రింజానీ పర్వతానికి ట్రెకింగ్‌కు వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

శనివారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో పర్వత శిఖరాన్ని చేరుకునే క్రమంలో జూలియానా కాలు జారి దాదాపు 490 అడుగుల లోతులో కొండచరియల మధ్య పడిపోయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె సహాయం కోసం అరవడంతో అప్రమత్తమైన ట్రెక్కింగ్ బృందం సహాయక అధికారులకు సమాచారం అందించింది.
డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా మొదట్లో ఆమె ప్రాణాలతోనే ఉన్నట్టు గుర్తించినా, దట్టమైన పొగమంచు, పర్వత భూభాగం క్లిష్టత, వర్షాల కారణంగా రిస్క్యూ బృందాలు తక్షణమే ఆమె వద్దకు చేరలేకపోయాయి. జూలియానా ఇసుకలో చిక్కుకుపోవడంతో తాళ్ల సాయంతో ఆమెను బయటకు తీసుకురావడంలో తీవ్రంగా ఇబ్బంది ఎదురైనట్లు రెస్క్యూ టీం లీడర్ ముహమ్మద్ హరియాది తెలిపారు.
చివరికి నాలుగు రోజుల శ్రమ తర్వాత మంగళవారం జూలియానా మృతదేహాన్ని రికవర్ చేసినట్లు ఇండోనేసియా సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని బ్రెజిల్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఇండోనేసియాలో రెండో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతంగా గుర్తింపు పొందిన మౌంట్ రింజానీ 12,224 అడుగుల ఎత్తులో ఉండి, ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రయాణికులు ఇక్కడకు వస్తుంటారు. అయితే, ఇది ప్రమాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. గత నెలలో కూడా మలేసియా పర్యాటకుడు ఇక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.