Interesting Facts: ప్రపంచంలో అత్యంత రహస్యమైన జీవి.. దీని గురించి తెలిస్తే షాక్‌ అవుతారు..!

Interesting Facts: మానవుడు చంద్రుడిపై కాలు మోపి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాడు కానీ ఇప్పటికీ సముద్రం లోపలి పరిస్థితి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు.

Update: 2023-10-15 14:30 GMT

Interesting Facts: ప్రపంచంలో అత్యంత రహస్యమైన జీవి.. దీని గురించి తెలిస్తే షాక్‌ అవుతారు..!

Interesting Facts: మానవుడు చంద్రుడిపై కాలు మోపి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాడు కానీ ఇప్పటికీ సముద్రం లోపలి పరిస్థితి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. సైన్స్‌లో ఇంత పురోగతి సాధించినా నేటికీ సముద్రం లోపల ప్రపంచం రహస్యంగానే ఉంది. ఇక్కడ జీవుల గురించి చాలామందికి తెలియదు. జలచరాల జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద జంతువు గురించి తెలుసుకుందాం.

బ్లూ వేల్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవి

సముద్రంలో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. దాని అడుగున శాస్త్రవేత్తలు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద జంతువు అంటార్కిటిక్ బ్లూ వేల్. ఇది సముద్రంలో మాత్రమే కనిపిస్తుంది. నీలి తిమింగలాలు ఉత్తర పసిఫిక్, దక్షిణ మహాసముద్రం, భారతీయ దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి.

బ్లూ వేల్‌కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు

బ్లూ వేల్ బరువు దాదాపు 4,00,000 పౌండ్లు. ఒక తిమింగలం 33 ఏనుగుల బరువు ఉంటుంది. దాదాపు 98 అడుగుల పొడవుంటుంది. ఈ తిమింగలం గుండె కారు అంత పెద్దదిగా ఉంటుంది. దాని నాలుక ఏనుగు అంత బరువు ఉంటుంది. ఇది భూమిపై అతిపెద్ద జంతువు అని ఎందుకంటారో ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు.

డైనోసర్లు కూడా చిన్నవే..

డైనోసార్ల కంటే బ్లూవేల్ సైజు పెద్దది. అతిపెద్ద డైనోసార్ అస్థిపంజరం పొడవు 27 మీటర్లు అని ఒక అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో తిమింగలం పొడవు 30 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ. నీలి తిమింగలాలు 80 నుంచి 90 సంవత్సరాలు జీవిస్తాయి. దీనికి మొప్పలు ఉండవు. అందువల్ల ప్రతి నిమిషం ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి వస్తాయి.

ఇది చాలా ఆసక్తికరం

బ్లూ వేల్ గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది క్షీరదం. ఇది భూమిపై అతిపెద్ద జంతువు మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వరం కలిగి ఉంటుంది. నీలి తిమింగలం శబ్దం జెట్ ఇంజిన్ కంటే బిగ్గరగా ఉంటుంది. ఇది వందల మైళ్ల దూరం నుంచి వినబడుతుంది. జెట్ ఇంజిన్ 140 డెసిబుల్స్ వరకు ధ్వనిని ఉత్పత్తి చేయగలదు అయితే తిమింగలం 188 డెసిబుల్స్ వరకు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.

Tags:    

Similar News