Foreign Travel: విదేశాలకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ విషయాలు కచ్చితంగా తెలిసుండాలి..

Foreign Travel: విదేశాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెళుతున్న దేశంలో ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు

Update: 2021-11-01 13:45 GMT
విదేశాలకువెళ్ళేవారు తెసుకోవాల్సిన జాగ్రత్తలు (ఫైల్ ఇమేజ్)

Foreign Travel: విదేశాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెళుతున్న దేశంలో ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు. అందుకే ఆ దేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీ పర్యటన విజయవంతమవుతుంది. లేదంటే దేశం కానీ దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి నిబంధనలు, చట్టాలు, సంస్కృతి, భాష, ఆహారం, ప్రయాణం, వీసా, పాస్‌పోర్ట్ మొదలైన విషయాలు తెలుసుకోవడం మంచిది.

1. పాస్‌పోర్ట్

విదేశాలకు వెళ్లేటప్పుడు ఎప్పుడైనా సరే పాస్‌పోర్ట్ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే పాస్‌పోర్ట్‌తో ఇబ్బందులు ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. లేదంటే చాలా కష్టం.

2. ఎంట్రీ, ఎగ్జిట్ ఫీజు

కొన్ని దేశాలకు వీసా ప్రాసెస్‌ అనేది ఉండదు. కానీ అక్కడ ఎంట్రీ లేదా ఎగ్జిట్ రుసుము చెల్లించాలి. ఈ రుసుం ఎంతుంటుందో ముందుగానే తెలుసుకుంటే మంచిది. లేదంటే అక్కడి వెళ్లిన తర్వాత ఇబ్బందులు ఉండవచ్చు.

3. ఔషధాలు

మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే మీక కావలసిన ఔషధాలు అక్కడ దొరుకుతాయో లేదో తెలియదు. కనుక ముందుగానే కొనుగోలు చేసి దగ్గర ఉంచుకుంటే బెటర్. లేదంటే అక్కడికి వెళ్లిన తర్వాత సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఒక్కసారి ఆరోగ్య పరిస్థితని కూడా సమీక్షించుకుంటే మంచిది.

4. ఎక్కడెక్కడ తిరుగుతారు

మీరు ఆ దేశంలో ఏ ప్రాంతంలో తిరుగుతారో తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒక అంచనా ఉంటుంది. అక్కడి వాతావరణానికి, ఖర్చుకు అన్నిరకాలుగా ముందుగానే సిద్దపడవచ్చు. అప్పుడు ప్రయాణం సులభంగా మారుతుంది.

5. భోజనం

విదేశాలలో మీరు తినే భోజనం ఉంటుందో లేదో ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే చాలా దేశాలు మాంసాహారం తింటాయి. మీరు ఒకవేళ శాకాహారులైతే అక్కడ మీకు సంబంధించిన ఆహారం ఎక్కడ దొరకుతుందో సెర్చ్ చేయాలి. లేదంటే ఇబ్బందిపడుతారు.

Tags:    

Similar News