Peacock Feathers: నెమలి ఈకలకు బల్లులు నిజంగానే భయపడుతాయా..!

Peacock Feathers: ప్రతి ఇంట్లో సాయంత్రం వేళలో మనకు లైట్‌ వేయగానే గోడపై బల్లులు దర్శనమిస్తాయి.

Update: 2021-10-23 15:04 GMT

Peacock Feathers: నెమలి ఈకలకు బల్లులు నిజంగానే భయపడుతాయా..!

Peacock Feathers: ప్రతి ఇంట్లో సాయంత్రం వేళలో మనకు లైట్‌ వేయగానే గోడపై బల్లులు దర్శనమిస్తాయి. వెలుతురు కారణంగా వచ్చిన పురుగులను వేటాడుతుంటాయి. అలా ఇంట్లో ఎక్కడ లైట్‌ ఉంటే అక్కడ బల్లలు తిరుగుతుంటాయి. వీటిని చూసి ఇంట్లో పిల్లలు భయపడుతుంటారు. అందుకే వీటిని తరిమికొట్టడానికి చాలా మందులను ప్రయోగిస్తారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ నెమలి ఈకలు అవి తిరిగే ప్రదేశంలో పెడితే అవి రావని అంటారు. ఇది నిజమేనా.. కాదా తెలుసుకుందాం.

బల్లులు నెమలి ఈకలకు భయపడటానికి కారణం నెమలి పైభాగంలో ఉన్న డిజైన్. ఇది మెరుస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. బల్లి దీనిని పెద్ద జంతువు కన్నుగా భావిస్తుందని, దీని కారణంగా బల్లి భయపడుతుందని కొంతమంది నమ్ముతారు. అందుకే నెమలికి ఈకల దగ్గరకు రాదని చెబుతారు. నెమలి ఈకల నుంచి వచ్చే వాసన కారణంగా బల్లులు దాని నుంచి దూరంగా ఉంటాయని మరికొంతమంది నమ్ముతారు. ఇది కాకుండా నెమళ్ళు బహిరంగంగా ఉన్నప్పుడు బల్లులను తింటాయని, అందుకే చాలా కీటకాలు నెమళ్ళకు దూరంగా ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ కారణాలు నిజమని శాస్త్రీయంగా నిరూపించబడలేదు.

Tags:    

Similar News