Viral Video: పాములు బాబోయ్, పాములు... షాకింగ్ వీడియో..!
Viral Video: పాములు అంటే చాలా మందికి భయం. అయితే వంద పాములు ఒకేచోట ఉన్నాయని తెలిసితే ఎంత భయంకరంగా ఉంటుంది ఊహించండి.
Viral Video: పాములు బాబోయ్, పాములు... షాకింగ్ వీడియో..!
Viral Video: పాములు అంటే చాలా మందికి భయం. అయితే వంద పాములు ఒకేచోట ఉన్నాయని తెలిసితే ఎంత భయంకరంగా ఉంటుంది ఊహించండి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఈ సంఘటన నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముడియ కాలా గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ మూలన పడేసిన డ్రమ్‌ను పక్కకు తొలగించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఊహించని విధంగా ఒక పాము బయటకు రావడంతో అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే భయంతో అక్కడినుంచి దూరంగా వెళ్లాడు.
కొద్ది సేపటి తర్వాత ధైర్యంగా మళ్లీ వెళ్లి ఆ డ్రమ్మును ఓపెన్ చేసి చూశాడు. కానీ అది జీవితం లో మరిచిపోలేని క్షణంగా మారింది. ఎందుకంటే ఆ డ్రమ్‌లో ఏకంగా 100 పాములు బుసలు కొడుతూ కదలాడుతూ కనిపించాయి.
వెంటనే పాములను పట్టే వ్యక్తిని పిలిపించగా.. చాలా జాగ్రత్తగా అన్ని పాములను సురక్షితంగా పట్టుకుని, దగ్గరలోని అడవిలో విడిచిపెట్టాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.