Yusuf Pathan: అల్లర్ల మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో యూసుఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్ట్... ఏకిపారేస్తున్న బీజేపి

Update: 2025-04-13 10:59 GMT

Yusuf Pathan: అల్లర్ల మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో యూసుఫ్ పఠాన్ 'గుడ్ ఛాయ్' పోస్ట్... ఏకిపారేస్తున్న బీజేపి

Yusuf Pathan's Good Chai Post gets huge backlash: మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన యూసుఫ్ పఠాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి విమర్శల పాలయ్యారు. మధ్యాహ్నం పూట ఛాయ్ తాగుతూ ఫోటోలు దిగిన యూసుఫ్ పఠాన్, ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మధ్యాహ్నం మంచి వాతావణంలో ఛాయ్ ఎంజాయ్ చేస్తున్నాను అని ఆ పోస్టులో పేర్కొన్నారు. పఠాన్ పెట్టిన ఆ పోస్టు ఆయన్ను ఊహించని విధంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శల పాలయ్యేలా చేసింది.

గత వారం రోజులుగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక వాతావరణం నెలకొని ఉంది. వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్టును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగుతున్నారు. కొన్నిచోట్ల ఈ ధర్నాలు హింసాత్మకంగా మారి ముగ్గురి ప్రాణాలు తీశాయి. అల్లర్లు జరుగుతున్న ప్రాంతం యూసుఫ్ పఠాన్ లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బహరాంపూర్ నియోజకవర్గం పరిధిలోకి రాకపోయినప్పటికీ, ఆ నియోజకవర్గానికి అతి దగ్గర్లోనే అల్లర్లు జరుగుతున్నాయి.

అయితే, నియోజకవర్గం చుట్టూ విధ్వంసం జరుగుతుంటే, ఆయన మాత్రం ఆ అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా గుడ్ ఛాయ్ అని ఛాయ్ ఎంజాయ్ చేస్తూ పోస్ట్ పెడతారా అని బీజేపి మద్దతుదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పి అల్లర్లు జరుగుతుంటే, ఒక బాధ్యత కలిగిన ఎంపీగా యూసుఫ్ పఠాన్ నడుచుకునే వైఖరి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.   

Most read interesting news stories: జనం ఎక్కువగా చదివిన వార్తా కథనాలు

Tags:    

Similar News