Parliament Monsoon: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల ఆందోళన
* తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్న అవినాష్‌రెడ్డి * ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్-షెకావత్
పార్లమెంట్ సమావేశాలు (ఫైల్ ఫోటో)
Parliament Monsoon Session 2021: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చర్చకు వరుసగా మూడోరోజు నోటీసులిచ్చిన వైసీపీ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఇక, లోక్‌సభలో కృష్ణా జలాల వివాదాన్ని ప్రస్తావించిన ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్నారు. కేంద్ర జల్‌శక్తి రిలీజ్ చేసిన గెజిట్‌ను కూడా ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రస్తావించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు.