Women Alchohol Consumption in India:మద్యం సేవించే మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా..?
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నగరాల నుంచి గ్రామాల వరకు మహిళలు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడుతున్నారు.
మద్యం సేవించే మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా..?
Women Alchohol Consumption in India: మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నగరాల నుంచి గ్రామాల వరకు మహిళలు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడుతున్నారు. పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అయితే, మగవారితో చదువులు, ఉద్యోగాల విషయంలోనే కాదు... చివరకు మద్యం సేవించే విషయంలో కూడా వారు పురుషులతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు మద్యం సేవించే అలవాటు పురుషుల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా మద్యం తాగుతున్నారు. ఒకప్పుడు ఈ కల్చర్ విదేశాల్లో ఉండేది.. అది ఇప్పుడు మన దేశంలోనూ పెరిగిపోతోంది. ఇంతకీ మన దేశంలోని ఏ రాష్ట్ర మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తారు? టాప్ 1లో ఏ రాష్ట్రం నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్‌లో మద్య వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా సర్వే చేసింది. ముఖ్యంగా దేశంలోని ఏ రాష్ట్ర మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారో గుర్తించింది. ఈ క్రమంలో మహిళలు మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అసోం ముందుంది. సర్వే ప్రకారం ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలే ఉన్నాయి.
సాధారణంగా మెట్రో పాలిటన్ సిటీల్లో ఉద్యోగం, వ్యాపారాలు చేసే స్త్రీలు ఎక్కువగా మద్యం సేవిస్తుంటారనే భావన ఉంది. కానీ దీనికి విరుద్దంగా సర్వే ఫలితాలు వచ్చాయి. పూణే, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కాకుండా.. ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నట్టు తేలింది.
అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉంది. అసోంలో ఇది 16.5 శాతం, మేఘాలయలో 8.7 శాతం ఉందని సర్వేలో వెల్లడైంది. అలాగే మూడో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇక్కడ 3.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి వీళ్ల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో జార్ఖండ్‌లో 9.9 శాతం ఉండగా ఇప్పుడు 0.3 శాతంగా ఉంది. త్రిపురలో గతంలో 9.6 శాతం ఉండగా.. ఇప్పుడు 0.8 శాతం ఉంది. అంటే గతంతో పోల్చితే తగ్గింది.
ఆ తర్వాత సిక్కిం 0.3 శాతం, ఛత్తీస్‌గఢ్ 0.2 శాతం ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవలే దీని గురించి తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సర్వే వివరాలు బయటకు వచ్చాయి. NIAAA నివేదిక ప్రకారం మహిళల్లో మద్యం తాగే అలవాటు పెరుగుతోంది. మద్య పానియాలు తాగడం పురుషులతో పాటు మహిళలకు హానికరం అయినప్పటికీ పురుషుల కంటే మహిళల్లోనే మద్యపాన సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.