Winter Session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Winter Session: ఈనెల 29 వరకు 17 రోజుల పాటు వింటర్ సెషన్స్
Winter Session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Winter Session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివాడిగే సాగనున్నాయి. ఈనెల 29 వరకు వింటర్ సెషన్స్ జరగనున్నాయి. 17 రోజుల పాటు సమావేశాల్లో కేంద్రం 17 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్ డెంటల్ కమిషన్, కంటోన్మెంట్ , కోస్టల్ ఆక్వా్కల్చర్ బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. మరోవైపు సమావేశాల నిర్వహణ తేదీలపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. క్రిస్మస్ పండగ సెలవుల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామనడం సరికాదన్నాయి. అపోజిషన్స్ తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉన్నామన్నారు. 40 పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానిస్తే 31 పార్టీలు హాజరయ్యాయని చెప్పారు. క్రిస్మస్ పండగ తర్వాత కూడా పార్లమెంట్ సెషన్స్ వద్దనడం సరికాదని ప్రతిపక్షాలపై ప్రహ్లాద్ జోషి ఫైరయ్యారు.