బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా? 2025లో డిమాండ్‌, రేట్లపై తాజా అంచనలు ఇవే..!

2025లో భారతదేశంలో బంగారం డిమాండ్‌ స్వల్పంగా తగ్గొచ్చినా, పెట్టుబడి ఆశలు మాత్రం పెరుగుతున్నాయి. బంగారం ధరలు రూ.1 లక్ష మార్కును తాకే అవకాశాలు ఉండగా, తాజా ధరలు మరియు మార్కెట్ ట్రెండ్‌పై పూర్తివివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Update: 2025-07-22 06:25 GMT

Will Gold Prices Soar in 2025? Latest Forecasts on Demand and Rates

భారతదేశంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2025లో బంగారం వినియోగం కొంత నెమ్మదించే అవకాశమున్నా, పెట్టుబడిదారుల ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో బంగారాన్ని భద్రత కలిగిన ఆస్తిగా భావించే భారతీయులు, పెట్టుబడి నిమిత్తం బంగారాన్ని కొనుగోలు చేయడం పెరుగుతోంది.

2025లో బంగారం డిమాండ్ అంచనా:

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం, 2025లో దేశవ్యాప్తంగా బంగారం డిమాండ్‌ సుమారు 700 నుండి 800 మెట్రిక్ టన్నులు మధ్య ఉండే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే వినియోగంలో కొంత మందకడ కనిపించినా, అక్షయ తృతీయ, వివాహ సీజన్‌లు, ఇతర పండుగలు డిమాండ్‌ను నిలబెట్టే అంశాలుగా నిలుస్తున్నాయి.

బంగారం ధరల ఎత్తుకు కారణాలు:

ధరలు పెరగడంతో సాధారణ వినియోగదారులపై ప్రభావం పడుతోంది. అయినప్పటికీ, 2025 రెండవార్థంలో బంగారం ధరలు రూ. 1 లక్ష మార్కును కూడా తాకవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడిగా బంగారంపై నమ్మకం, మార్కెట్‌లో అస్థిరత, రూపాయి మారకం విలువల్లో మార్పులే ఇందుకు ప్రధాన కారణాలు.

జూలై 22, 2025న బంగారం, వెండి తాజా ధరలు (ప్రాంతాన్ని బట్టి మారవచ్చు):

  1. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,00,160 – ₹1,00,300
  2. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹91,810 – ₹91,950
  3. ఢిల్లీ మార్కెట్ ధర: 24 క్యారెట్ల బంగారం ₹99,020కి చేరుకుంది
  4. వెండి (1 కిలో): ₹1,11,000 – ₹1,26,000
  5. ఢిల్లీ వెండి ధర: ₹500 పెరిగి ₹1,11,000కి చేరుకుంది

ఈ ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. కొనుగోలుకు ముందు స్థానిక జ్యూయలర్ల వద్ద ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

Tags:    

Similar News