Parijatha Narasimha Reddy: కాంగ్రెస్ బి ఫామ్ మీదనే మహేశ్వరంలో పోటీ చేస్తా
Parijatha Narasimha Reddy: చివరి నిమిషం వరకు టికెట్ కోసం పోరాడుతాం
Parijatha Narsimha Reddy: కాంగ్రెస్ బి ఫామ్ మీదనే మహేశ్వరంలో పోటీ చేస్తా
Parijatha Narasimha Reddy: మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. మహేశ్వరం నియోజకవర్గంలో తనకి టికెట్ వస్తుందని అనుకున్న చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. చివరి వరకు తనపేరు కొనసాగిందన్నారు. కొంతమంది కుట్రలు ,కుతంత్రాలు వల్ల చేవెళ్ల నుంచి వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి టికెట్ రాకుండా కొంతమందితో రాయబారం నడిపిందని అన్నారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ తోనే ఉంటానన్నారు. కాంగ్రెస్ బీఫామ్ వచ్చేవరకు వేచి చూస్తా... బీఫాం మీదనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.