శుభలగ్నం మూవీ రిపీట్.. భర్తను రూ.5 లక్షలకు మరో మహిళకు అమ్మేసిన భార్య..!

Subhalagnam: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా “శుభలగ్నం” చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

Update: 2023-10-21 04:31 GMT

Representational Image

Subhalagnam: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా “శుభలగ్నం” చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో డబ్బు కోసం ఆమని పాత్ర.. తన భర్త జగపతిబాబుని, రోజాకు అమ్మేస్తుంది. ఆ సమయంలో.. "మంగళ సూత్రం అంగడి సరుకా... కొనగలవా చెయ్యి జారాకా" అనే ఫంక్తులతో వచ్చిన ఒక పాట ఇప్పటికీ వన్ ఆఫ్ ది తెలుగు హిట్ సాంగ్ అనే చెప్పాలి. కట్ చేస్తే... తాజాగా నిజజీవితంలోకూడా అలాంటి సంఘటనే జరిగింది. కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి గుర్తించింది. వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా పట్టుకుని నిలదీసింది. గొడవ పంచాయితీ వరకు వెళ్లింది. అయితే భర్తకు సన్నిహితంగా ఉన్న మహిళ నీ భర్త రూ.5లక్షలు తన వద్ద తీసుకున్నాడని ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. డబ్బులు చెల్లించాకే భర్తను తీసుకెళ్లాలని తెలిపింది. అలాంటి భర్త నాకేమీ వద్దని, నాకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి, అతన్ని నువ్వే ఉంచుకోవాలని ఆ ఇల్లాలు చెప్పింది. ఆ నగదు ఇచ్చేందుకు ఒక నెల సమయం ఇస్తే ఆ నగదు ఇస్తానని ఆ మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి అంగీకరించింది. వీరిద్దరూ చేసుకున్న రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు అవాక్కయ్యారు.

Tags:    

Similar News