మా అంతర్గత వ్యవహారల్లో పాక్ జోక్యం ఎందుకు

Update: 2019-11-10 09:43 GMT
Raveesh Kumar

వివాదాస్పద స్థలం రామజమ్మభూమి- బాబ్రి మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వివాదాస్పద వ్యాఖ్యలలు చేశారు. కర్తార్ పుర్ కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతుండగా అదే సమయంలో అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం విచారానికి గురి చేసిందని అన్నారు. సున్నితమైన అంశంపై తీర్పు ఇవ్వడానికి మరికొన్ని రోజలు వేచివుండలేకపోయారా అని ప్రశ్నించారు. భారత్ లో ముస్లీంలు ఇబ్బందులు పడుతున్నారని, తీర్పుతో వారిని మరింత ఆందోళన చెందుతున్నారని పాక్ విదేశాంగ మంత్రిషా వ్యాఖ్యానించారు. సుప్రీం ధర్మాసనం తనకు స్వేచ్ఛ లేదని చాటుకొందని ఫిర్దౌస్ అవాన్ విమర్శించారు.

దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. అయోధ్య తీర్పు పూర్తిగా తమ వ్యక్తిగతమని దానిలో పాక్ జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఒక సివిల్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాలను భారత్ చట్టం గౌరవిస్తుందని తెలిపారు. పాక్ భారత్ లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందని రవీశ్ కుమార్ అన్నారు. అయోధ్య అంశంపై సుప్రీం ఇచ్చిన తీర్పును పలు దేశాల దౌత్యాధికారులకు వివరిచారు. కేసు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేశారు. 

Tags:    

Similar News