Operation Karregutta-2: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు

Operation Karregutta-2: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ కర్రెగుట్టలు-2' భారీ విజయాన్ని అందుకుంది.

Update: 2026-02-19 06:51 GMT

Operation Karregutta-2: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు

Operation Karregutta-2: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ కర్రెగుట్టలు-2' భారీ విజయాన్ని అందుకుంది. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

మావోయిస్టు అగ్రనేత, కార్యదర్శి దేవ్‌జీ సహా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ (CRPF) మరియు గ్రేహౌండ్స్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 2 వేల మంది జవాన్లు కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా, ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక అగ్రనేతలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం అటవీ ప్రాంతంలో కాల్పులు సద్దుమణిగినప్పటికీ, మరికొందరు మావోయిస్టులు లోపల దాగి ఉండవచ్చనే అనుమానంతో సెర్చ్ ఆపరేషన్‌ను తీవ్రతరం చేశారు. హెలికాప్టర్ల ద్వారా కూడా నిఘా పెంచారు. ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Full View


Tags:    

Similar News