E Passport: ఈ పాస్‌పోర్ట్ ఎవరు జారీ చేస్తారు.. ఉపయోగాలేంటి..?
E Passport: ఈ పాస్‌పోర్ట్ ఎవరు జారీ చేస్తారు.. ఉపయోగాలేంటి..?
E Passport: ఈ పాస్‌పోర్ట్ ఎవరు జారీ చేస్తారు.. ఉపయోగాలేంటి..?
E Passport: ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పాస్‌పోర్ట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. అసలు ఈ పాస్‌పోర్ట్ అంటే ఏమిటీ.. దీని వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి. తదితర విషయాలు తెలుసుకుందాం. ఈ-పాస్‌పోర్ట్‌లో పౌరుల గుర్తింపు కోసం రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) బయోమెట్రిక్స్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్‌పోర్ట్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ-పాస్‌పోర్ట్ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం భద్రతని మరింత పటిష్టం చేయడం అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్‌ను సులభతరం చేయడం. అందుకే దీనిని ప్రవేశపెడుతున్నారు.
ఈ-పాస్‌పోర్ట్‌లో మైక్రో చిప్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఇందులో మీ పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు మొదలైన వివరాలన్ని ఉంటాయి. ఈ-పాస్‌పోర్ట్ సాయంతో మీరు ఇమ్మిగ్రేషన్ లైన్ల నుంచి తప్పించుకుంటారు. సులభంగా చిటికెలో స్కాన్ అవుతుంది. ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సిన పాస్‌పోర్ట్ హోల్డర్లందరికీ ఈ-పాస్‌పోర్ట్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ-పాస్‌పోర్ట్‌లో నమోదు చేసిన వివరాలని సులభంగా మార్చడం తారుమారు చేయడం కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఫోర్జరీని తగ్గిస్తుంది.
అన్ని కుదిరితే కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాలలో ఈ-పాస్‌పోర్ట్ ప్రక్రియ కొనసాగుతున్నాయి. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు, అలాగే పాత పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు ఈ-పాస్‌పోర్ట్‌లు అందిస్తారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP)లో ఇవి తయారవుతున్నాయి.