President Elections: భారత రాష్ట్రపతి ఎవరు?
President Elections: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశారు
President Elections: భారత రాష్ట్రపతి ఎవరు?
President Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90 శాతం ఓటింగ్ నమోదైంది. పార్లమెంటులో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే 8 మంది ఎంపీలు ఓటు వేయలేదని అధికారులు తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. ముర్ముకు అధికార బీజేపీతో పాటు ఎన్డీయే పక్షాలు మద్దతిచ్చాయి. ఎన్డీయేతర పార్టీలైన బిజూ జనతాదల్, శివసేన, అకాళీదల్ కూడా ముర్ముకే మద్దతు ప్రకటించాయి. దీనికి తోడు ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటేశారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఫలితాల తరువాత ఎన్నికైన అభ్యర్థి ఈనెల 25న భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేస్తారు. పోలింగ్ పూర్తయ్యాక ఆయా రాష్ట్రాల బ్యాలెట్ బాక్సులన్నీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు అధికారులు.