రెండుసార్లు భారత్ వీసా నిరాకరణ: ఎవరీ క్షమా సావంత్?

Who is Kshama Sawant: క్షమా సావంత్ కు భారత్ వీసా నిరాకరించింది. ఆమె ఇండో అమెరికన్. ఇండియాలో ఉన్న ఆమె తల్లి ఆరోగ్యం విషమంగా ఉంది

Update: 2025-02-06 10:18 GMT

రెండుసార్లు భారత్ వీసా నిరాకరణ: ఎవరీ క్షమా సావంత్?

Who is Kshama Sawant: క్షమా సావంత్ కు భారత్ వీసా నిరాకరించింది. ఆమె ఇండో అమెరికన్. ఇండియాలో ఉన్న ఆమె తల్లి ఆరోగ్యం విషమంగా ఉంది. డయాబెటీస్, కిడ్నీ వ్యాధులతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఆమెను చూసేందుకు క్షమా సావంత్ భారత్ కు వచ్చేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2024 నవంబర్ లో క్షమా సావంత్ అత్యవసర వీసా అభ్యర్ధన దరఖాస్తు చేసినా ప్రయోజనం లేదు.

వీసా తిరస్కరణపై సావంత్ రియాక్షన్ ఏంటి?

తన తల్లిని చూసేందుకు వీసా కోసం 2024 మేలో సావంత్ ఫస్ట్ టైమ్ అప్లయ్ చేశారు. ఈ వీసా అప్లికేషన్ తిరస్కరించారు. అదే సంవత్సరం జూన్ లో కూడా మరోసారి ఆమె మరోసారి ధరఖస్తు చేశారు. రెండోసారి కూడా అలానే జరిగింది. ఇక మూడోసారి 2024 నవంబర్ లో అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేశారు. కానీ, ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం రాలేదని ఆమె ఓ మీడియా చానెల్ కు వివరించారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన సర్టిఫికెట్లను అందించినా కూడా అధికారులు స్పందించలేదనేది ఆమె ఆరోపణ. రాజకీయ కారణాలతోనే తన వీసా ఇవ్వడం లేదని ఆమె అంటున్నారు.

ఎవరీ క్షమా సావంత్?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై క్షమా సావంత్ బహిరంగంగా విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ, జాతీయ పౌరుల రిజిస్టర్ ఎన్ ఆర్ సీ వంటి విధానాలపై ఆమె విమర్శలు చేశారు. 2020లో సియాటెల్ నగర కౌన్సిల్ లో ఈ విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి పలువురు మద్దతు కూడా లభించింది. కుల వివక్షు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది. ఇందులో క్షమా సావంత్ కీలకపాత్ర పోషించారు.నగరంలో కనీస వేతనాన్ని గంటకు 7.25 డాలర్ల నుంచి 20.76 డాలర్లకు పెంచడంలో ఆమె కీలకం.

క్షమా సావంత్ భర్త కాల్విన్ ప్రీస్ట్‌కు వీసాను భారత్ మంజూరు చేసింది. తనకు ఎందుకు వీసా ఇవ్వరని ఆమె ప్రశ్నిస్తోంది.సావంత్ గతంలో జూన్ 2022లో ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.

తమిళనాడు నుంచి సియాటెల్ వరకు

తమిళనాడులోని సామాన్య కుటుంబంలో క్షమా సావంత్ పుట్టారు. ముంబైలో పెరిగారు. యూనివర్శిటీ ఆఫ్ ముంబైలో కంప్యూటర్ సైన్స్ లో పట్టా పొందారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత పేదరికం, వివక్ష ముఖ్యంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలని భావించారు. అమెరికాకు వెళ్లి ఎకనామిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. సియాటెల్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ టకోమాలో పాఠాలు చెప్పారు. సోషలిస్ట్ అల్టర్నేటివ్ పార్టీ తరపున 2012లో చట్టసభకు పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఆమెకు 29 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత సియాటెల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా గెలిచారు.

ఆశోక్ స్వైన్ కేసు కూడా

సావంత్ కేసు ప్రత్యేకమైనది కాదు. స్వీడన్‌లో నివసించే ప్రొఫెసర్ అశోక్ స్వైన్, భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్న తన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు రద్దుకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారు.సావంత్ లాగే స్వెయిన్‌కు కూడా ఒక వృద్ధ తల్లి ఉంది, ఆమెకు సంరక్షణ అవసరం. భారత్ కు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి.

సావంత్ తల్లి వసుంధర రామానుజం వయస్సు 82 ఏళ్లు.ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమయంలో క్షమా సావంత్ ఆమె పక్కన ఉండాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News