Prayagraj Kumbh Mela Stampede: మహా కుంభమేళాలో తొక్కిసలాటకు కారణం ఏంటి?
Prayagraj Kumbh Mela Stampede: మహా కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు.
Prayagraj Kumbh Mela Stampede: మహా కుంభమేళాలో తొక్కిసలాటకు కారణం ఏంటి?
Prayagraj Kumbh Mela Stampede: మహా కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది భక్తులు మరణించారు. చీకట్లో చెత్త బుట్టలు కాళ్లకు తగలడంతో కొందరు కింద పడిపోయారు. చీకట్లో చెత్త బుట్టలు తాకి కింద తొక్కిసలాటకు కారణమైందని కొందరు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే త్రివేణి సంగమం రూట్లలో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పుణ్యస్నానాలకు వెళ్లేందుకు వెళ్తున్న భక్తులను వెనుక నుంచి వచ్చిన కొందరు తోశారని ఇది తొక్కిసలాటకు కారణమైందనే ప్రచారం కూడా ఉంది. తొక్కిసలాట సమయంలో కొద్దిసేపు పుణ్యస్నానాలను నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు 3 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు.
తొక్కిసలాటపై యోగి సమీక్ష
తొక్కిసలాటపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు. సంగం ఘాట్ వైపు వెళ్లొద్దని భక్తులకు సూచించారు. తొక్కిసలాటపై ఎలాంటి వదంతులు నమ్మవద్దని భక్తులను ఆయన కోరారు. దగ్గరలో ఉన్న ఘాట్లలోనే పుణ్యస్నానాలు చేయాలని ఆయన కోరారు. తొక్కిసలాట జరిగినా పుణ్యస్నానాలు ఆగవని ఆయన చెప్పారు.
యోగికి ప్రధాని మోదీ ఫోన్
ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిన తర్వాత ప్రధాని తనకు నాలుగు సార్లు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారని సీఎం యోగి తెలిపారు. మరో వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా యూపీ సీఎం యోగితో మాట్లాడారు.