West Bengal: నాలుగో దశ ఎన్నికలు హింసాత్మకం
West Bengal: ఎన్నికల్లో హింస చెలరేగింది.
వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఫైల్ పోటో
West Bengal: బెంగాల్ నాలుగో దశ ఎన్నికల్లో హింస చెలరేగింది. రెండు ఘటనల్లో ఐదుగురు మరణించారు. రెండు సంఘటనలపైనా టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒక ప్రాంతంలో పోలింగ్ జరుగుతుంటే..మరో ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. నాలుగో దశ ఎన్నికల్లో 76.16 శాతం పోలింగ్ నమోదైంది.
బెంగాల్ సీఎం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో టేప్ సంచలనం సృష్టిస్తోంది. బెంగాల్లో మమత బెనర్జీకి ఎంత ప్రజాదరణ ఉందో... అదే స్థాయిలో మోడీకి కూడా ఉందంటూ పీకే చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఈ టేప్ ఆధారంగా...టీఎంసీ పనైపోయిందంటూ బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. బెంగాల్ లో ప్రధాని మోడీకి భారీగా ఆదరణ ఉందని... కొన్ని ప్రాంతాల్లో బీజేపీ భారీ విజయాలను సొంతం చేసుకుంటుందంటూ పీకే చేసిన వ్యాఖ్యలు మీడియాలో హల్చల్ చేశాయ్.