Amit Shah: ఆరు ప్రాంతాల్లో విచారణను సీబీఐకి అప్పగిస్తాం..

Amit Shah: రాష్ట్రంలో శాంతి స్థాపనకు గవర్నర్‌ ఆధ్వర్యంలో పీస్‌ కమిటీ

Update: 2023-06-01 06:31 GMT

Amit Shah: ఆరు ప్రాంతాల్లో విచారణను సీబీఐకి అప్పగిస్తాం..

Amit Shah: మూడు రోజుల పాటు మణిపూర్‌ పర్యటించిన అమిత్‌షా ఇటీవలి మణిపూర్ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. హింసను పరిశీలించడానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని దర్యాప్తు ప్యానెల్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. హింసాత్మకమైన ఈశాన్య రాష్ట్రంలో తన మూడు రోజుల పర్యటనను ముగించిన అమిత్ షా, అధికారులు మరియు రాజకీయ పార్టీలతో సహా సమాజంలోని ప్రతి వర్గాలతో అనేక రౌండ్ల సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.

హింసకు కారణాలను అన్వేషించడానికి మరియు దానికి బాధ్యులను గుర్తించడానికి ఒక దర్యాప్తు ప్యానెల్ ఏర్పాటు చేయబడుతుందన్నారు. ఈ దర్యాప్తు ప్యానెల్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహిస్తారని అమిత్‌షా తెలియజేశారు.ఆరు ప్రాంతాల్లో విచారణకు సీబీఐకి అప్పగిస్తామని అమిత్‌ షా తెలిపారు. అంతేకాకుండా మణిపూర్‌-మయన్మార్ సరిహద్దులో భద్రతను కూడా పెంచామని షా తెలియజేశారు. ఈ దర్యాప్తు మణిపూర్ గవర్నర్ మార్గదర్శకత్వంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు.

Tags:    

Similar News