Mallikarjun Kharge: కూటమి కలయికతో తొలి లక్ష్యం సాధించాం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం ఒక్కటయ్యాం..
Mallikarjun Kharge: 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీ
Mallikarjun Kharge: కూటమి కలయికతో తొలి లక్ష్యం సాధించాం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం ఒక్కటయ్యాం
Mallikarjun Kharge: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల నేతల భేటీలో కూటమి పేరును ఖరారు చేశారు. ప్రతిపక్షాల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధికారికంగా వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం ఒక్కటయ్యామని..రాబోయే రోజుల్లో కూటమి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఖర్గే. ఇక మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు ఖర్గే. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలంటే మోడీకి భయం పట్టుకుందని.. అందుకే.. సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు ఖర్గే.