చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం నుంచి నీటి చుక్కలు
* ఆజాద్ విగ్రహానికి మరమ్మతులు చేయించిన అధికారులు
చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం నుంచి నీటి చుక్కలు
ChandraShekhar Azad: UP ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ కాంస్య విగ్రహం నుంచి నీటి చుక్కలు పడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక పార్కులో ఏర్పాటు చేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం నుంచి నీటి చుక్కలు కారుతున్నాయి. ఇలా నీటి చుక్కలను గమనించిన ఓ స్థానికుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ విగ్రహానికి అధికారులు మరమ్మతులు చేశారు. అయితే విగ్రహం నుంచి నీటి చుక్కలు కారుతున్నాయన్న విషయం తెలుసుకున్న కొంతమంది ఇది అద్భుతమంటున్నారు. విగ్రహం నుంచి కారుతున్న నీటిని నుదుటిపై రాసుకుని అమరవీరుడి దీవెనలుగా ఫీలవుతున్నారు. నిపుణులు మాత్రం ఇది అత్యంత సాధారణమని కొట్టిపారేస్తున్నారు. విగ్రహానికి ఎక్కడో పగుళ్లు ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కూడా విగ్రహానికి పగుళ్లు ఏర్పడి ఉండవచ్చన్నారు. కారణం ఏదైనా ఆజాద్ విగ్రహం నుంచి పడుతున్న నీటి చుక్కల ఇష్యూ ఇపుడు ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో హాట్ టాపిక్ అయ్యింది.