Watch: బైక్ మీద వచ్చి ఒక మూటను రోడ్డుపక్కన పడేసారు.. మూటను విప్పి చూస్తే.. షాకింగ్ ఘటన

Watch: ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తే ఒళ్లు గగులుపడుస్తున్నాయి. ఎప్పుడుఎక్కడ ఎలాంటి క్రైమ్ జరుగుతుందో తెలియడం లేదు. అసలు ప్రజలు ఎందుకు ఇంత కిరాతకంగా మారిపోతున్నారో అంతుచిక్కడం లేదు.

Update: 2025-07-10 11:25 GMT

Watch: బైక్ మీద వచ్చి ఒక మూటను రోడ్డుపక్కన పడేసారు.. మూటను విప్పి చూస్తే.. షాకింగ్ ఘటన

Watch: ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తే ఒళ్లు గగులుపడుస్తున్నాయి. ఎప్పుడుఎక్కడ ఎలాంటి క్రైమ్ జరుగుతుందో తెలియడం లేదు. అసలు ప్రజలు ఎందుకు ఇంత కిరాతకంగా మారిపోతున్నారో అంతుచిక్కడం లేదు. తాజాగా పంజాబ్‌లో లూథియానో మరో ఘోరమైన సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి రోడ్డు పక్కను మూటను పడేసి వెళ్లిపోయారు. అది తెరిచి చూస్తే అందరూ షాకై పోయారు. వివరాల్లోకి వెళ్లితే..

పంజాబ్‌లోని లూథియానాలో రోడ్లు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. నిత్యం అక్కడ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ రద్దీలో ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి మూసి ఉన్న ఒక మూటను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోతున్నారు. అయితే అది చూసిన ఒక వ్యక్తి ఆ మూటలో ఏముంది అని అడిగితే..కుళ్లిన మామిడి పండ్లు ఉన్నాయని ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ తర్వాత ఆ మూట తీసి చూసినవారు షాక్ తింటారు.

రద్దీగా ఉండే లూథియానా రోడ్డులో పక్కపక్కలే దారుణం జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన మూటను పడేసి వెళ్లిపోతారు. చుట్టుపక్కలున్న స్థానికులు ఆ మూటలో ఏముంది అని అడిగితే.. కుళ్లిన మామిడి పండ్లను చెబుతారు. అయితే ఆ తర్వాత ఆ మూట విప్పి చూస్తే.. అందులో ఉన్నవి కుళ్లిన మామిడి పండ్లు కాదు ఒక మహిళ శవం. ఇది చూసి అంతా షాకైపోతారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఘటన జరిగినప్పుడు రోడ్డు చాలా బిజీగా ఉంది. చుట్టుపక్కల కూడా చాలా షాపులున్నాయి. చాలామంది ఆ ఇద్దరు వ్యక్తులు మూటను పడేయడం చూశారు కూడా. దీన్నిబట్టి చూస్తే ఆ ఇద్దరు పట్టపగలే నేరం చేసి ఎలా వెళ్లిపోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.

ఇటీవల లూథియానాలో ఒక వ్యక్తిని హత్య చేసి అతని మృతదేహాన్ని డ్రమ్‌ లో వేసిన ఘటన జరిగింది. ఈ సంఘటన జరగక ముందే మరో మహిళల శవాన్ని దుండగలు రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. ఇలా మనుషులను చంపేసి రోడ్లపైన పడేయడంపై స్థానికులు కంగారు పడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.



Tags:    

Similar News