Voter ID Card: ఓటర్ ఐడిలో ఇంటి చిరునామా మార్చాలనుకుంటున్నారా.. ఇంట్లో కూర్చొనే సింపుల్‌గా ఇలా చేయండి..!

Voter ID Card: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 2022 అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించారు.

Update: 2022-01-13 13:30 GMT

Voter ID Card: ఓటర్ ఐడిలో ఇంటి చిరునామా మార్చాలనుకుంటున్నారా.. ఇంట్లో కూర్చొనే సింపుల్‌గా ఇలా చేయండి..!

Voter ID Card: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 2022 అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో ఓటు వేయాలంటే కచ్చితంగా మీరు ఓటరు ఐడీ కార్డును కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఓటరు ఐడీ కార్డ్ సహాయంతో, ప్రతి ఓటరు దేశంలోని మున్సిపల్, రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో ఓటు వేసే అవకాశం ఉంది. దీనితో పాటు, ఓటరు కార్డు చాలా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటిగా ఉందని తెలిసిందే. దీనితోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను గుర్తింపు కార్డులుగా వినియోగిస్తున్నారు. ఈ రోజుల్లో హోటల్ బుకింగ్ నుంచి హాస్పిటల్ వరకు ప్రతి ప్రదేశంలో ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ మొదలైనవి కీలకంగా మారాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓటరు గుర్తింపు కార్డులో ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేయాల్సి వస్తోంది. ఆడపిల్లల పెళ్లిళ్లు, ఇల్లు మారడం వంటి సందర్భాల్లో చాలాసార్లు ఓటరు గుర్తింపు కార్డులోని చిరునామా మార్చుకోవాల్సి వస్తోంది. మీరు కూడా ఆన్‌లైన్‌లో ఓటరు గుర్తింపు కార్డును మార్చుకోవాలనుకుంటే ఇలా చేయండి. ఇంటి చిరునామాను మార్చే ప్రక్రియ గురించి ఇప్పడు తెలుసుకుందాం..

మీ ఓటరు ఐడీ కార్డులో అడ్రస్‌ను ఇలా మార్చుకోండి..

ఓటర్ ఐడీలో మార్పులు చేయడానికి, మీరు ముందుగా జాతీయ ఓటర్ల సేవా పోర్టల్ www.nvsp.inపై క్లిక్ చేయండి.

దీని తర్వాత ఇక్కడ మీరు 'ఎలక్టోరల్ రోల్‌లో నమోదుల సవరణ' విభాగంపై క్లిక్ చేయండి.

దీని తర్వాత మీరు ఫారం 8ని క్లిక్ చేయాలి. ఓటరు గుర్తింపు కార్డులో అడ్రస్ ఛేంజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

ఆ తర్వాత, రాష్ట్రం, అసెంబ్లీ లేదా పార్లమెంటరీ నియోజకవర్గం సమాచారాన్ని పూరించాలి.

అనంతరం ఎలక్టోరల్ రోల్ నంబర్, లింగం, కుటుంబంలోని తల్లిదండ్రులు లేదా భర్త గురించిన సమాచారాన్ని పూరించాలి.

ఆ తర్వాత, మీరు మార్చాలనుకుంటున్న సమాచారాన్ని ఎంచుకోండి.

అనంతరం మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని నమోదు చేయండి.

ఆ తర్వాత ఫాంను సబ్మిట్ చేయండి.

మీ సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత ఓటరు గుర్తింపు కార్డు మీ అడ్రస్‌కు పంపిస్తారు.

Tags:    

Similar News