లోక్‌సభ ముందుకు ఓటర్‌ ఐడీ - ఆధార్‌ అనుసంధాన బిల్లు.. వ్యతిరేకించిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు

Lok Sabha Today: బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభలో ఎంఐఎం నోటీసులు...

Update: 2021-12-20 08:43 GMT

లోక్‌సభ ముందుకు ఓటర్‌ ఐడీ - ఆధార్‌ అనుసంధాన బిల్లు.. వ్యతిరేకించిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు

Lok Sabha Today: లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు.  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి.

అయినప్పటికీ దీన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుతో పాటు లఖింపుర్‌ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టకుండానే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. 

Tags:    

Similar News