పంజాబ్ డీజీపీపై వేటేసిన ప్రభుత్వం.. కుట్ర పూరితంగానే..

Punjab DGP: పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ భవ్రాను నియమించారు.

Update: 2022-01-08 09:53 GMT

పంజాబ్ డీజీపీపై వేటేసిన ప్రభుత్వం.. కుట్ర పూరితంగానే..

Punjab DGP: పంజాబ్ కొత్త డీజీపీగా వీరేష్ భవ్రాను నియమించారు. మూడు రోజుల క్రితం ప్రధాని పంజాబ్ టూర్ లో భద్రతా లోపాలతో కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఓ హైవేపై నిలిచిపోవడం కలకలం రేపింది. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కుట్ర పూరితంగానే డీజీపీ ప్రధాని పర్యటనను అడ్డుకున్నారని పెద్ద ఎత్తున బీజేపి విమర్శలు చేసింది. అటు బీజేపి, ఇటు సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కోవింద్ ఈ అంశంపై పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఉక్కిరిబిక్కిరైన సీఎం చన్నీ పంజాబ్ డీజీపీపై వేటు వేశారు. పంజాబ్ డీజీపీ సిద్ధార్ధ్ చటోపాధ్యాయ స్థానంలో వీరేష్ భవ్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News