Viral Video: బాలరామునికి సూర్యతిలకం.. అయోధ్యలో అరుదైన ఘట్టం వీడియో..!
Surya Tilak At Ayodhya Video: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. బాల రాముడికి సూర్య తిలకం దృశ్యాల కనువిందు చేస్తున్నాయి.
Viral Video: బాలరామునికి సూర్యతిలకం.. అయోధ్యలో అరుదైన ఘట్టం వీడియో..!
Surya Tilak At Ayodhya Video: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడికి అద్భుతమైన ఘట్టం నిర్వహించారు. అయోధ్య అంటేనే రాముడు జన్మభూమి. ఈ నేపథ్యంలో అయోధ్యలోని బాలరాముడికి సూర్య తిలకం దృశ్యం చూసి భక్తులు పులకించి పోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాల రాముడిని నుదుటి పై సూర్య కిరణాలను ప్రసరింపజేశారు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి భక్తులంతా పులకించిపోయారు.
శ్రీరామనవమి ఏప్రిల్ 6 ఆదివారం ఈ రోజున దేశవ్యాప్తంగా శ్రీరామజన్మ ఉత్సవాలు, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే అయోధ్యలో మాత్రం రాముడికి అరుదైన క్రతువు నిర్వహించారు. నాలుగు నిమిషాల పాటు సూర్యకిరణాలు బలరాముని నుదుటిపై ప్రసరింపజేశారు. అయితే ఇక్ష్వాకు వంశపు పితృదేవుడు సూర్య భగవానుడు కాబట్టి రాముడితో కూడా అత్యంత సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆ అరుదైన దృష్యం చూసి భక్తులంతా పులకించిపోయారు.
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి శ్రీరామనవమి రోజు సూర్య కిరణాలు బాల రాముని నుదుటిపై ప్రసరింపజేసే ఆనవాయితీ కూడా కొనసాగుతోంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని అద్దాలు, లెన్సులను ఉపయోగించి సూర్యకిరణాలు గర్భగుడిలోని బలరాముని నుదుటిపై ప్రసరింప చేస్తారు.
ఈసారి కూడా శ్రీ రామనవమికి ఈ క్రతువును నిర్వహించారు. దీంతో భక్తులు కన్నులపండువగా వీక్షించారు. ప్రత్యేకంగా ఆలయ ట్రస్టు ఈ ఏర్పాటు చేసింది. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా వాళ్లు వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు జన్మభూమి దీర్ఘ క్షేత్ర ట్రస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.