Vijay: విజయ్ ఆవేదన.. కరూర్ ఘటనను సీఎం స్టాలిన్ రాజకీయం చేస్తున్నారు
కరూర్ ఘటనతో మనసు ద్రవించిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ తొలిసారి స్పందించారు.
Vijay: విజయ్ ఆగ్రహం.. కరూర్ ఘటనను సీఎం స్టాలిన్ రాజకీయం చేస్తున్నారు
కరూర్ ఘటనతో మనసు ద్రవించిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఎంతో ప్రేమతో తన మీటింగ్‌కు హాజరైన జనాలను ఇలా కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను త్వరలో పరామర్శిస్తానని హామీ ఇచ్చారు.
తమపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం అన్యాయమని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. “నాపై ప్రతీకారం తీర్చుకోండి, కానీ నా కార్యకర్తలపై కేసులు పెట్టొద్దు” అంటూ విజ్ఞప్తి చేశారు. కరూర్ ఘటన వెనుక నిజం త్వరలో వెలుగులోకి వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. “ఈ ఘటన ఎందుకు కరూర్‌లోనే జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అనుమతులు ఉన్న ప్రదేశంలోనే సభ జరిగింది. నేను మరింత బలంగా ముందుకు వస్తాను” అని విజయ్ స్పష్టం చేశారు.