Uttarkashi Tunnel Rescue: సిల్క్‌యారా నుంచి రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు..!
Uttarkashi Tunnel Rescue: రషికేశ్‌లో క్షుణ్ణంగా కార్మికులను పరిశీలించనన్న డాక్టర్లు
Uttarkashi Tunnel Rescue: సిల్క్‌యారా నుంచి రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు..!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీలోని సిల్క్‌యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులకు ఎట్టకేలకు బయటపడ్డారు. అనంతరం కార్మికులకు రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. టన్నెల నుంచి బయటపడ్డ కార్మికులందరూ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ నరేంద్ర తెలిపారు. అందరూ ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని.. అయినప్పటికీ వారందరికీ రక్త పరీక్షలు, రేడియాలజీ తదితర పరీక్షలు చేయనున్నట్లు వివరించారు.
అంతకుముందు సిల్క్‌యారా నుంచి కార్మికులందరినీ చినూక్ విమానంలో జాలిగ్రాంట్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. ఇక్కడ వైద్యుల బృందం చినూక్ హెలిప్యాడ్‌కు చేరుకున్నది. అక్కడ కార్మికులను పరిశీలించి.. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అంతకు ముందు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చిన్యాలిసౌర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 41 కార్మికులను కలిశారు. వారికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఇప్పుడు కార్మికులను ఎయిమ్స్ రిషికేశ్‌లో క్షుణ్ణంగా పరిశీలిస్తామని.. ఆ తర్వాతనే కార్మికులను ఇండ్లకు పంపించనున్నట్లు ఆయన వివరించారు.