10 రోజుల క్రితమే రూ. 90 లక్షలు ఖర్చుపెట్టి అమెరికా వెళ్లారు... అప్పుడే తిప్పి పంపించారు
10 రోజుల క్రితమే రూ. 90 లక్షలు ఖర్చుపెట్టి అమెరికా వెళ్లారు... అప్పుడే తిప్పి పంపించారు
US flight landed in Amritsar airport: అమెరికా నుండి రెండో మిలిటరీ విమానం వచ్చింది. C-17 గ్లోబ్‌మాస్టర్ అనే ఈ విమానంలో 119 మంది భారతీయులను అమెరికా ఇండియాకు డిపోర్ట్ చేసింది. వీరంతా అమెరికాలో సరైన పత్రాలు లేకుండా అక్కడి అధికారులకు దొరికిపోయారు. 10 రోజుల వ్యవధిలో ఇండియాకు అమెరికా పంపించిన రెండో విమానం ఇది.
ఫిబ్రవరి 5న టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి వచ్చిన మొదటి విమానంలో 104 మంది ఇండియాకు చేరుకున్నారు. ఆదివారం 157 మంది భారతీయులతో మూడో విమానం కూడా రానుంది.
పంజాబ్ సీం భగవంత్ మాన్ ఆరోపణలకు స్పందించిన బీజేపి
పంజాబ్‌లోని అమృత్‌సర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే అమెరికా డిపోర్టేషన్ విమానాలను దించుతుండటంపై ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కేంద్రంపై పలు ఆరోపణలు చేశారు. "అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ ఉన్నటువంటి పవిత్ర స్థలం. అలాంటి అమృత్‌సర్‌కు చెడ్డపేరు తీసుకురావడానికే భారతీయ అక్రమవలసదారులతో అమెరికా పంపిస్తోన్న విమానాలను ఢిల్లీకి రానివ్వకుండా కేంద్రం మధ్యలోనే అమృత్‌సర్‌లో దించుతోంది" అని భగవంత్ మాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
భగవంత్ మాన్ ఆరోపణలపై బీజేపి నేతలు స్పందించారు. అమెరికా నుండి ఇండియాలోకి వచ్చిన తరువాత మొదటిగా వచ్చే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అమృత్‌సర్ కావడం వల్లే కేంద్రం అమెరికా విమానాలను అక్కడే ల్యాండింగ్ చేస్తోందని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ జవాబిచ్చారు.
కేంద్రానికి పంజాబ్ సీఎం రివర్స్ కౌంటర్
అయితే, బీజేపి నేతల కౌంటర్‌కు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఒకవేళ బీజేపి నేతలు చెబుతున్నట్లుగా అమెరికా నుండి ఢిల్లీ కంటే అమృత్‌సర్ దగ్గరిగా ఉందని అనుకున్నట్లయితే, ఇక్కడి నుండే అమెరికా, కెనడా దేశాలకు అంతర్జాతీయ విమానాలు పంపించేందుకు ఎందుకు అనుమతించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
#WATCH | Punjab: The aircraft carrying the second batch of illegal Indian immigrants from the US, lands at the Amritsar airport. pic.twitter.com/5SNlv6YAqk
— ANI (@ANI) February 15, 2025
10 రోజుల క్రితమే అమెరికా వెళ్లారు..
అమెరికా పంపిస్తోన్న డిపోర్టేషన్ ప్లేన్‌లో తమ కుటుంబసభ్యులు కూడా వస్తున్నారని తెలుసుకున్న వారి కుటుంబాలు అమృత్‌సర్ విమానాశ్రయానికి వచ్చాయి. వీరిలో 10 రోజుల క్రితమే రూ. 45 లక్షలు ఖర్చుపెట్టుకుని ఏజెంట్ ద్వారా అమెరికా వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గుర్దాస్‌పూర్ సమీపంలోని ఖనోవాల్‌కు చెందిన ఓ కుటుంబం తమ అనుభవాన్ని అక్కడే ఉన్న మీడియాతో పంచుకుంది.
హర్జీత్ సింగ్ (22), హర్జోత్ సింగ్ (20) లను ఒక్కొక్కరికి రూ. 45 లక్షలు చొప్పున రూ. 90 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపించాం. వారు అమెరికా చేరుకున్నట్లు అక్కడే ఉన్న మా సమీప బంధువు నిశాన్ సింగ్ చెప్పారు. అమెరికాకు చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ వారిని అధికారికంగా అమెరికాలోకి ప్రవేశం ఇప్పిస్తానని నమ్మించారు. కానీ ఇంతలోనే ఇలా వెనక్కు తిప్పి పంపించారు" అని ఆ కుటుంబం చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది.
Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?
Who Is Shivon Zilis: మస్క్, మోదీ భేటీలో ఈ లేడీ ఎవరు?
అమెరికా నుండి అక్రమవలసదారుల డిపోర్టేషన్ ఫ్లైట్స్ విషయంలో ఆర్ధికంగా వెనుకబడిన అంత చిన్న దేశమైన కంబోడియా చేసిన పని భారతీయుల కోసం ఎన్డీఏ సర్కార్ చేయలేదా అంటున్న విపక్షాలు