సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరోసారి గడువు పెంపు
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరోసారి గడువును పెంచింది యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్ యూపీఎస్‌సీ.
SSC Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు..టైమ్, రూల్స్ ఇవే
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు మరోసారి గడువును పెంచింది యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్ యూపీఎస్‌సీ. అఖిల భారత సర్వీసు ఉద్యోగాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 979 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షల కోసం ఈ ఏడాది జనవరిలోలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. అయితే ఆ గడువును ఫిబ్రవరి 18 వరకు పొడిగించారు. ఆ తర్వాత ఈ గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈ ఏడాది మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.
యూపీఎస్‌సీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి కనీసం 21 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 32 ఏళ్లు దాటవద్దు. 2025 ఆగస్టు 1 వరకు అభ్యర్థుల వయస్సును లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పోస్టులకు దరఖాస్తుకు అప్లయ్ చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.