ప్రధాని పదవిపై ఆసక్తి, బీజేపి హై కమాండ్‌తో విభేదాలపై యోగి రిప్లై ఏంటంటే

Update: 2025-04-01 15:03 GMT

ప్రధాని పదవిపై ఆసక్తి, బీజేపి హై కమాండ్‌తో విభేదాలపై యోగి రిప్లై ఏంటంటే

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పీటీఐ సీఈఓ, చీఫ్ ఎడిటర్ విజయ్ జోషి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో యోగి పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ జోషి మాట్లాడుతూ, "మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ అభిమానిస్తోంది. ప్రధాని మోదీ కూడా అంతే అభిమానిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ ప్లస్ యోగి అనే పేర్లను కలుపుతూ ప్రధాని మోదీ మిమ్మల్ని ఉపయోగి అని పిలుస్తారు. మిమ్మల్ని ఎప్పటికైనా సరే ప్రధానిగా చూడాలని కోరుకునే జనం కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి ఉందా" అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ "తను ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని. యూపీ ప్రజలకు సేవ చేసేందుకు బీజేపి అధిష్టానం నన్ను ఇక్కడ పెట్టింది. అంతేకానీ రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్ జాబ్ కానేకాదు. నేను ఎప్పుడైనా యోగినే. యోగిలానే ఉంటాను" అని సమాధానం ఇచ్చారు. తను ఇక్కడ పనిచేస్తున్నంత కాలమే ఇలా ఉంటాను కానీ లేదంటే తను యోగిలానే ఉంటాను అని ఆయన బదులిచ్చారు.

బీజేపి అధిష్టానంతో మీకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది కదా.. దానికి మీరు ఏం చెబుతారు అని విజయ్ జోషి ప్రశ్నించారు. అందుకు యోగి స్పందిస్తూ పార్టీ అధిష్టానంతో విబేధాలు ఉన్నాయనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఒకవేళ పార్టీ అధిష్టానంతో తనకు పడకపోతే తను ఇలా ముఖ్యమంత్రి పదవిలో ఎలా కొనసాగుతానని ఎదురు ప్రశ్నించారు. పార్టీ నుండి తనకు అన్నివిధాల సహాయసహకారాలు ఉన్నాయని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

Tags:    

Similar News